Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alpha OTT: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha)థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ ఏడాది జూన్ 3న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అంచనాలను అందుకోలేక పోయింది. అయితే ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
తాజా సమాచారం ప్రకారం 2026 ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ‘ఆల్ఫా’ స్ట్రీమింగ్ కానుంది. శివ్ రావైల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆల్ఫా’లో అలియా భట్‌తో పాటు శర్వరి కీలక పాత్రలో నటించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఇప్పటివరకు హీరోల చుట్టూ ఎక్కువగా కథలు తిరగగా, తొలిసారి ఇద్దరు మహిళా ఏజెంట్లను ప్రధాన పాత్రలుగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. అలియా భట్ సీత పాత్రలో, శర్వరి దుర్గ పాత్రలో కనిపించారు. ఈ ఇద్దరు ఏజెంట్లు ప్రమాదకరమైన మిషన్‌లోకి వెళ్లడం, అక్కడ ఎదురయ్యే కుట్రలు, శత్రువుల చుట్టూ కథ సాగుతుంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక ఈ సినిమాకు భారీ తారాగణం కూడా ఉంది. బాబీ డియోల్ ఫతే సింగ్ లఖావత్ పాత్రలో కనిపించగా, అనిల్ కపూర్ ఆర్ఏడబ్ల్యూ చీఫ్ విక్రాంత్ కౌల్గా నటించారు. ఇక హృతిక్ రోషన్ మరోసారి కబీర్ ధలీవాల్ పాత్రలో అతిథి పాత్రలో కనిపించడం స్పై యూనివర్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆల్ఫా’ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం వంటి డబ్బింగ్ వెర్షన్ల స్ట్రీమింగ్పై మాత్రం ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. కాబట్టి ఇతర భాషల్లో సినిమా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది.
స్టోరీ
ఆల్ఫా (Alpha) కథ ఇద్దరు నైపుణ్యం కలిగిన మహిళా స్పై ఏజెంట్లు (అలియా భట్, శార్వరి) చుట్టూ తిరుగుతుంది. అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన మిషన్లను పూర్తి చేయడంలో వీరు సిద్ధహస్తులు. దేశ రక్షణకు పెను ముప్పుగా మారిన ఒక అంతర్జాతీయ తీవ్రవాద ముఠాను అణచివేయడం వీరి ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో, బాబీ డియోల్ పోషించిన శక్తివంతమైన విలన్ పాత్ర వీరి దారికి అడ్డుగా నిలుస్తుంది. అతడు పన్నిన వ్యూహాలను, సవాల్లను ఎదుర్కొంటూ ఈ ఇద్దరు స్పై ఏజెంట్లు అంతర్జాతీయ సరిహద్దులు దాటి పోరాడాల్సి వస్తుంది.
అనిల్ కపూర్ పోషించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) చీఫ్ పాత్ర పర్యవేక్షణలో వీరు ఈ రహస్య ఆపరేషన్‌ను నిర్వహిస్తారు. అయితే, మిషన్ పురోగతిలో ఉన్నప్పుడు నమ్మకద్రోహాలు, ఊహించని మలుపులు ఎదురవుతాయి. యాక్షన్, మైండ్ గేమ్‌లతో సాగే ఈ పోరాటంలో, YRF స్పై యూనివర్స్‌కు చెందిన ‘కబీర్’ (హృతిక్ రోషన్) ఒక కీలకమైన సమయంలో రంగంలోకి దిగి వీరికి సహాయం అందిస్తాడు. దేశభక్తి, కర్తవ్య నిర్వహణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే ఇద్దరు మహిళల సాహస గాథే ఈ ‘ఆల్ఫా’ కథ.
మొత్తానికి థియేటర్లలో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయిన అలియా భట్ ‘ఆల్ఫా’కు ఓటీటీ మరో అవకాశం ఇవ్వనుంది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఎలాంటి స్పందన వస్తుంది? థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో దీనిని హిట్ చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!