బాలీవుడ్ భామ అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ, ప్రశంసలు లభిస్తున్నాయి. ఎక్కువ మంది ప్రజలు థియేటర్లకు వచ్చేలా చూసేందుకు ‘గంగూబాయి కతియావాడి’ని అలియా తనవంతు ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అలియా భట్ పేరు మార్చుకుంది. ‘పుష్ప’ మూవీని చూసి అలియా భట్ ఫ్యామిలీ మొత్తం బన్నీకి అభిమానులు అయిపోయారట. దీంతో ‘పుష్ప’రాజ్ పై మనసు పారేసుకున్న ఈ బాలీవుడ్ భామ ఇప్పుడు ఆయనతో కలిసి నటించడానికి ఉవ్విళ్లూరుతోంది.
Read Also : Khiladi : హీరోయిన్ కు సారీ చెప్పిన డైరెక్టర్… ఏం జరిగిందంటే ?
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలియా ప్రైమ్ వీడియోలో అల్లు అర్జున్ ‘పుష్ప’ను చూశానని, టాలీవుడ్ ఐకాన్ స్టార్‌కి పెద్ద అభిమానిని అయ్యానని పేర్కొంది. “నా కుటుంబం మొత్తం ‘పుష్ప’ను చూసి అల్లు అర్జున్‌కి అభిమానులుగా మారారు. వారు నన్ను బన్నీతో కలిసి ఎప్పుడు నటిస్తావు అని అడుగుతున్నారు. అంతేకాదు ఇంట్లో వారు నన్ను ఆలు అని పిలుస్తున్నారు. ‘ఆలు అల్లుతో కలిసి ఎప్పుడు నటిస్తావు అని అడుగుతున్నారు. ఆయనతో కలిసి పని చేసే అవకాశం వస్తే చాలా సంతోషిస్తాను” అని ఆలియా భట్ చెప్పింది.అల్లు అర్జున్‌తో నటించే అవకాశం ఆలియా భట్‌కి ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీలోనూ నటిస్తోంది.