Ranbir- Alia: బాలీవుడ్ అడోరబుల్ కపుల్ రణబీర్ కపూర్- అలియా భట్ ఇటీవలే తల్లిదండ్రులుగా మారిన విషయం తెల్సిందే. ఈ మధ్యనే అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక బుల్లి యువరాణికి కపూర్ ఫ్యామిలీ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అలియా ఒక్క క్షణం కూడా పాపను వదలడం లేదట. రణబీర్ సైతం షూటింగ్ ను ఆపేసి మరీ కూతురుతో ఆడుకుంటున్నట్లు బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలియా ప్రెగ్నెంట్ అయిన దగ్గరనుంచి ఆమెపిల్లలకు ఎలాంటి పేరు పెడుతుందో అని అందరు ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్నారు.
ఎట్టకేలకు అలియా తన కూతురు పేరును రివీల్ చేసింది. ఈ అందాల జంట కూతురు పేరు రహా కపూర్. రహ అనే పేరును రణబీర్ తల్లి నీతూ కపూర్ పెట్టిందట.. రహా అంటే స్వరానికి దారి అనే మీనింగ్ వస్తుందట. అరబిక్ లో శాంతి అని, సంస్కృతంలో వంశం అని అర్ధం వస్తుందట. ఈ విషయాన్ని అలియా సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. చిన్నారితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.