NTV Telugu Site icon

Akshay Kumar : ఫ్లాప్‌ డైరెక్టర్ తో అక్షయ్ కుమార్ సినిమా..?

Akshay Kumar

Akshay Kumar

రీసెంట్ టైమ్స్‌లో ఖిలాడీ హీరో బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమౌతుంది. సూర్యవంశీ తర్వాత తన మార్క్ సినిమాను తీసుకు రాలేదు. రీసెంట్లీ వచ్చిన స్కై ఫోర్స్ ఓకే అనిపించుకుంది. దీంతో జస్ట్ ఫర్ ఛేంజ్ కోసం సౌత్ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. మొన్నామధ్య తమిళ ప్లాప్ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌తో చర్చించాడని టాక్ నడిచింది. ఇప్పుడు గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుతో డిస్కషన్లు జరిగాయన్నది కోలీవుడ్ ఇన్నర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వెంకట్ ప్రభు చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నది బజ్.

Also Read : Malavika Mohanan : అనుకున్నది ఒకటి.. అయినది మరోటి..

సౌత్ దర్శకులతో అక్షయ్ వర్క్ చేయాలనుకోవడం ఇప్పుడు కొత్త కాదు ఎప్పటి నుండో బాండింగ్ కొనసాగుతుంది. గతంలో మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్‌తో  హేరా పేరీ, భూల్ భూలయ్యా, గరమ్ మసాలా, దే దానా దన్, కట్టా మీఠా లాంటి హిట్స్  కొట్టాడు అక్కి. అలాగే ప్రభుదేవాతో రౌడీ రాథోడ్ కమర్షియల్‌గా సక్సెస్ అందుకుంది. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‍తో హాలీడే చేశాడు ఖిలాడీ హీరో. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకోవడమే కాదు అక్షయ్ మినిమం గ్యారెంటీ హీరో నుండి స్టార్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి కారణమయ్యాయి. అక్షయ్‌కు సౌత్ దర్శకులు హిట్స్ మాత్రమే కాదు. ప్లాప్స్ కూడా అందించారు. లక్ష్మీతో రాఘవ లారెన్స్, సర్ఫిరాతో సుధా కొంగర డిజాస్టర్లను ఇచ్చారు. అయినప్పటికీ సౌత్ ఫిల్మ్ మేకర్లతో మరో సినిమా చేసేందుకే రెడీ అయ్యాడు. ఆల్రెడీ ప్రియదర్శన్ తో 14 ఏళ్ల తర్వాత భూత్ బంగ్లా రూపంలో హిట్ కాంబో రిపీట్ అవుతుంది. అలాగే వెంకట్ ప్రభు, అరుణ్ మాథేశ్వరన్‍లో ఒకరితో వర్క్ చేసే అవకాశం లేకపోలేదు. ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేదు ఈ మధ్య. అయినప్పటికీ మరోసారి సౌత్ బెల్త్ దర్శకులను గట్టిగానే నమ్ముతున్నాడు ఖిలాడీ.