ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’. ఇప్పటివరకూ 10 సినిమాలు చేసి, పదీ హిట్స్ కొట్టిన ఏకైక దర్శక-హీరో కాంబినేషన్ వీళ్లది మాత్రమే. ‘గోల్మాల్’ ఫ్రాంచైజ్ ఆడియన్స్ ని నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్… సింగం ఫ్రాంచైజ్ తో యాక్షన్ మోడ్ లోకి దిగి సాలిడ్ హిట్స్ కొట్టారు. సింగం, సింగం రిటర్న్స్ సినిమాలతో సక్సస్ ఫుల్ ఫ్రాంచైజ్ ఇచ్చిన రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్… బాజీరావ్ సింగం క్యారెక్టర్ ని ఐకానిక్ గా మార్చేశారు. అటా మాజీ సటక్ లీ డైలాగ్ నార్త్ ఆడియన్స్ లో చిన్న పిల్లలు కూడా చెప్తారు అంటే సింగం ఫ్రాంచైజ్ ని ఉన్న ఫాలోయింగ్ రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు మూడో సినిమా సింగం అగైన్ తెరకెక్కుతోంది.
2024 ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకి రానున్న సింగం అగైన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అజయ్ దేవగన్ తో పాటు టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొణేలు కూడా సింగం అగైన్ కాస్ట్ లిస్టులో చేరారు. లేటెస్ట్ గా సింబా, రణ్వీర్ సింగ్… ఇప్పుడు సూర్యవన్షీ అక్షయ్ కుమార్ కూడా సింగం అగైన్ షూటింగ్ లో జాయిన్ అయిపోయారు. ‘సూర్యవన్షీ’ సినిమా క్లైమాక్స్ లోకి అజయ్ దేవగన్ ని తీసుకోని వచ్చి సింగం 3కి లీడ్ ఇచ్చిన రోహిత్ శెట్టి… దాన్ని కంటిన్యూ చేస్తూ సింబా, సూర్యవన్షీ, సింగంని ఒక్కటి చేస్తూ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు. సింగం అగైన్ సినిమాలో ఒకే ఫ్రేమ్ లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా, టైగర్ ష్రాఫ్ లు కలిసి ఫైట్ చేస్తూ కనిపిస్తే నార్త్ ఆడియన్స్ లో జోష్ మాములుగా ఉండదు.