బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సెల్ఫీ’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కీ రోల్స్ ప్లే చేశారు. స్టార్ హీరోకి, ఆర్టీవోకి మధ్య జరిగే ఇగో కథగా తెరకెక్కుతున్న ‘సెల్ఫీ’ సినిమా ఫిబ్రవరి 24న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ అక్షయ్ కుమార్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ‘సెల్ఫీ’ మూవీ టైటిల్ సాంగ్ ‘సెల్ఫీ’ని లాంచ్ చెయ్యడానికి మేకర్స్ ఈవెంట్ క్రియేట్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్, అభిమానులతో సెల్ఫీలు దిగాడు. కేవలం 3 నిమిషాల్లో 184 సెల్ఫీలు దిగి హిస్టరీ క్రియేట్ చేశాడు. దీంతో కేవలం మూడు నిమిషాల్లో అత్యధిక సెల్ఫీలు తీసుకున్న నటుడిగా అక్కీ ఇప్పుడు ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.
ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత, అక్షయ్ మీడియాతో మాట్లాడాడు మరియు ఇది తన అభిమానులకు నేను డెడికేడ్ చేస్తున్న స్పెషల్ మొమెంట్ అన్ని చెప్పిన అక్షయ్ కుమార్… ‘నేను ఇప్పటివరకు సాధించిన ప్రతిదీ మరియు నా జీవితంలో ఈ క్షణంలో నేను ఎక్కడ ఉన్నాను, ప్రతిచోటా నా అభిమానుల బేషరతు ప్రేమ మరియు మద్దతు కారణంగా. ఇది వారికి ప్రత్యేక నివాళులర్పించడం, నా కెరీర్‌లో వారు నాకు మరియు నా పనికి ఎలా అండగా నిలిచారో గుర్తించడం” అని చెప్పాడు. ప్రస్తుతం సెల్ఫీ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది కాబట్టి అదే ఇంపాక్ట్ హిందీలో కూడా చూపిస్తే అక్షయ్ కుమార్ ఫ్లాప్ స్ట్రీక్ బ్రేక్ అయినట్లే.