Site icon NTV Telugu

Akshay Kumar: ఛత్రపతి శివాజీగా మారిన బాలీవుడ్ ఖిలాడీ

Akshay

Akshay

Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇటీవలే రామసేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని నిరాశపర్చింది. ఇక సినిమా సినిమాకు కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వని అక్షయ్ తాజాగా మరో సినిమాను మొదలుపెట్టేశాడు. బయోపిక్ లు తీయాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా బాలీవుడ్ లో అక్షయ్ ముందు ఉంటాడు. ఇప్పటికే కేసరి, సామ్రాట్ పృద్విరాజ్ లాంటి పీరియాడిక్ సినిమాలలో నటించి మెప్పించిన అక్షయ్ ఇప్పుడు ఛత్రపతి శివాజీగా మారాడు.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం వేదాంత్ మరాఠీ వీర్ దౌడ్లే సాత్. ఈ సినిమాతో అక్షయ్ మరాఠీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మహారాష్ట్ర దిగ్గజ రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పాత్రలో అక్షయ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా నేడు షూటింగ్ ను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఛత్రపతి శివాజీ లుక్ లో అక్షయ్ అద్భుతంగా కనిపించాడు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కూడా ఆ రాజసం, ఠీవి కనిపించాయి. ఇక ఈ ఫోటోను షేర్ చేస్తూ అక్షయ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని, ఈ చిత్రం కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version