విశ్వనటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అచ్చం మడం నాణం పయిర్పు’. రాజా రామూర్తి దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇక దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అక్షర హాసన్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ” ఈ చిత్రంలో నేను ఒక టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తాను. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, సామజిక విలువలు కాపాడడానికి తనలో ఉన్న శృంగార కోరికలను చంపుకొని బతికే యువతి కథ ఇది. తన కట్టుబాటులను, సామజిక విలువను కాపాడుతూ ఆ యువతీ ఎన్ని ఇబ్బందులు పడిందో సున్నితంగా చూపించారు డైరెక్టర్.
నా నిజ జీవితంలో కూడా నేను ఇలాంటివి ఫేస్ చేశాను. టీనేజ్ లో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. కానీ చాలామంది తమ బాధలను పంచుకోలేక, దైర్యంగా ఉండలేక చనిపోతున్నారు. అలా కాకుండా పెరిగే కొద్దీ తమ బలం, బలహీనత ఏంటో తెలుసుకొని నిజమైన క్యారెక్టర్ ని నిరూపించుకోవాలి. కుటుంబ విలువలను, శృంగార కోరికలను రెండిటిని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. వేరే వాళ్ల లైఫ్ గురించి మాట్లాడానికి ఎవరికి హక్కు లేదు.. నేను ఇలా ముఖం మీదే నిక్కచ్చిగా మాట్లాడతాను అనే నాతో చాలామంది మాట్లాడానికి ఇష్టపడరు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
