NTV Telugu Site icon

Akshara Haasan: కమల్ కూతురితో ప్రేమాయణం.. చివరికి ఆమెతో పెళ్లి

Akshara

Akshara

Akshara Haasan: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎవరు.. ఎవరిని ప్రేమిస్తారో.. ఎవరు.. ఎవరిని పెళ్లాడతారో.. ? ఇక చివరికి ఎందుకు విడాకులిస్తారో కూడా అర్ధం కాదు. పెళ్ళికి ముందు ప్రేమాయణాలు అనేవి ఇండస్ట్రీలో కామన్ గా మారిపోయాయి. ఒక సినిమా చేస్తే.. అందులో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం.. కొన్ని రోజులు కలిసి తిరగడం.. నచ్చకపోతే విడిపోవడం.. ఇదొక ట్రెండ్ గా నడుస్తూ వస్తుంది. ఇక తాజాగా కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ తో ప్రేమాయణం నడిపిన ఒక నటుడు ఇప్పుడు పెళ్ళికి రెడీ అయ్యాడు. అతనే నటుడు తనూజ్ విర్వాని. అలనాటి అందాల తార రతి అగ్నిహోత్రి ముద్దుల తనయుడు. 2013 లో కొడుకును బాలీవుడ్ కు పరిచయం చేసింది రతి. మనోడి దురదృష్టం.. క్లిక్ అవ్వలేకపోయాడు. ఇక ఓటిటీ పుణ్యమా అని ఇన్ సైడ్ ఎడ్జ్ అనే సిరీస్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత కోడ్ M, పాయిజన్, మసాబా మసాబా లాంటి సిరీస్ లు చేసి ఆకట్టుకున్నాడు.

Akkineni Nagarjuna: నా సామీ రంగా.. ఏమున్నాడ్రా కింగ్

ఇక కెరీర్ మొదలుపెట్టిన రోజుల్లోనే తనూజ్.. అక్షర హాసన్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత కొన్ని రోజులకు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ప్రేమ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే కొన్ని విబేధాల వలన వీరు విడిపోయారు. ఆ తరువాత తనూజ్.. మరో నటితో ఎఫైర్ నడిపినట్లు కూడా సమాచారం. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరిని కాదని.. తాన్య జాకబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఆమె తన జీవితంలోకి రావడం అదృష్టమని రాసుకొస్తూ.. నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది.

Show comments