Akkineni Nagarjuna: 34 ఏళ్ళ క్రితం చైన్ తో వచ్చాను.. ఇప్పుడు కత్తితో వస్తున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమాలో నాగ్ సరసన సోనాల్ చౌహన్ నటిస్తోంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో నిర్వహించారు. ఈ వేదికపై కింగ్ నాగార్జున మాట్లాడుతూ “తమ కుటుంబాన్ని ఇంతవరకు ఆదరిస్తున్నారంటే ఇద్దరికీ థాంక్స్ చెప్పాలి.. ఒకటి తెలుగు చిత్ర పరిశ్రమ, ఇంకొకటి అక్కినేని నాగేశ్వరరావు గారు అని చెప్పుకొచ్చాడు. 34 ఏళ్ల క్రితం అక్టోబర్ 5 శివ అనే ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వచ్చింది.. అప్పుడు చైన్ పట్టుకొని వచ్చా.. ఇపుడు అదే అక్టోబర్ 5 కత్తితో మీ ముందుకు వస్తున్నా అని తెలిపారు. విజయ దశమి అందరికి విజయాలిస్తుందని అంటారు.. ఈ విజయ దశమి ఘోస్ట్ కి విజయాన్ని అందిస్తుందని అనుకుంటున్నాను అని అన్నారు.
ఇక అప్పుడు శివలో సౌండ్స్ గురించి మాట్లాడారు.. ఇప్పుడు ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ గురించి యాక్షన్ సన్నివేశాల గురించి మాట్లాడతారు. ఇప్పటివరకు నేను ఎన్నో గన్నులు, కత్తులు పట్టుకొని తిరిగాను.. అయినా నాకు ఈ సినిమా కోసం ప్రవీణ్ మిలటరీ ట్రైనింగ్ ఇప్పించాడు.. హీరోయిన్ సోనాల్ కు కూడా అదే ట్రైనింగ్ ఇప్పించాడు.. పాపం ఆమె కాలు చేతులు విరగొట్టుకొంది కూడా అని తెలిపాడు. ఇంకా నాగ్ మాట్లాడుతూ..గ తంలో చైతుతో బంగార్రాజు సినిమా చేసా.. .త్వరలో అఖిల్ తో సినిమా తీస్తున్నా.. ఒక ఏజెంట్, ఘోస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అని చెప్పుకొచ్చాడు. గతంలో అన్నమయ్య సినీమాకు కర్నూల్ వచ్చాను.. స్వామివారికి దండం పెట్టి, బసవన్న ముందు డ్యాన్స్ వేశానని చెప్పిన నాగ్ ఘోస్ట్ అక్టోబర్ 5 న రిలీజ్ అవుతోంది. మీరు తనను ఎలా చూడాలనుకున్నారో అలాగే కనిపిస్తానని చెప్పారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం.. విజయదశమి రోజున ఘోస్ట్ సినిమా రిలీజ్ అవుతుందని, అదే రోజున తన స్నేహితుడైన చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ కూడా రిలీజ్ కానున్నదని, రెండు సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Also Read
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
తాజావార్తలు
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!