Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ఈ ఏడాది నా సామి రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత నాగ్.. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి శేఖర్ కమ్ముల – ధనుష్ మూవీ. లవ్ స్టోరీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన రష్మిక నటిస్తోంది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు అని తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక ఈలోపే ఈ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వుంటేనే ఒక గ్యాంగ్ స్టర్ టచ్ లో కథ కొనసాగుతూ ఉంటుందట.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఒక గ్యాంగ్ స్టర్ గా నాగార్జున కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో కూడా నాగ్ నెగెటివ్ షేడ్స్ తో కనిపించనున్నాడట. ఇక ఈ విషయం తెలియడంతో నాగ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగ్ కు గ్యాంగ్ స్టర్ పాత్రలు కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా సినిమాలల్లో నాగ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు. భాయ్ సినిమా నుంచి దేవదాస్ వరకు చాలా సినిమాలు అదే తరహాలో ఉండడంతో..మళ్లీ మళ్లీ అదే పాత్ర.. బోర్ కొట్టడం లేదా నాగ్.. ? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే శేఖర్ కమ్ముల టేకింగ్ వేరేలా ఉంటుంది కాబట్టి ఏమో .. ఈసారి నాగ్ కూడా కొత్త తరహాలో కనిపించొచ్చు అని అనుకోవచ్చు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.