అక్కినేని అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కలిసి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని రోజు రోజుకీ పెంచుతూ మేకర్స్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది, సాలిడ్ హిట్ అవుతుంది అని అక్కినేని ఫాన్స్ లెక్కలు వేసుకుంటూ ఉంటే అందరికీ షాక్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న తెలుగు, మలయాళ భాషల్లో మాత్రమే రిలీజ్ అవుతుంది మిగిలిన భాషల్లో కాస్త గ్యాప్ తీసుకోని రిలీజ్ చేస్తామని క్లియర్ కట్ గా చెప్పేశారు. మమ్ముట్టీ ఉన్నాడు కాబట్టి మలయాళ రిలీజ్ ని స్టిక్ అయ్యి ఉన్నారు కానీ ఇతర భాషల్లో ఏజెంట్ సినిమాని రిలీజ్ చెయ్యకపోవడానికి కారణాలు ఉన్నాయి. తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కూడా ఏప్రిల్ 28నే విడుదల కానుంది, ఈ మూవీని దాటి తమిళనాడులో ఏజెంట్ కి థియేటర్స్ రావడం అనేది కష్టమైన పని. ఇలానే హిందీలో ఒక వారం ముందే సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా రిలీజ్ అవుతోంది.
కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఏజెంట్ ని రిలీజ్ చెయ్యడం అనేది మంచి ఆలోచన కాదు. సల్మాన్ సినిమా మాములుగానే బాక్సాఫీస్ దగ్గర హ్యుజ్ ఓపెనింగ్స్ ని రాబడుతుంది, అలాంటిది ఇక రంజాన్ పండగ రోజున అంటే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినిమాల కారణంగానే ఏజెంట్ మూవీని ఏప్రిల్ 28న తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యట్లేదు. తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ చేసిన వారం తర్వాత మంచి డేట్ చూసుకోని హిందీ, తమిళ్ రిలీజ్ కి వెళ్లనున్నారు. అయితే తెలుగులో ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయితే ఇతర భాషల్లో రిలీజ్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది, ఈ విషయం కూడా మేకర్స్ కి అఖిల్ కి బాగా తెలుసు కానీ ఏజెంట్ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకంలో ఉన్నారు. మరి ఏప్రిల్ 28న ఏమవుతుందో చూడాలి.