“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పుడు డిఫరెంట్ జోనర్ ను ప్రయత్నిస్తున్నాడు. “ఏజెంట్” అంటూ యాక్షన్ మోడ్ లోకి దిగుతున్నాడు. ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 12న థియేటర్లలోకి రానుంది. ప్రముఖ మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించనున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. హిప్ హాప్ తమిజా సంగీతం సమకూర్చారు. సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది.
Read Also : Director Shankar : హ్యాట్సాఫ్ ‘మహారాజ’మౌళి
తాజాగా ‘ఏజెంట్’ హైదరాబాద్ మెట్రోలో కన్పించారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అఖిల్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. సమాచారం ప్రకారం సినిమాలోని కీలక భాగాన్ని చిత్రీకరించడానికి ‘ఏజెంట్’ బృందం హైదరాబాద్ మెట్రో ఎక్కింది. ఈ పిక్ ను చూస్తుంటే మెట్రోలో యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నట్టు అన్పిస్తోంది. అఖిల్ పొడవాటి, జుట్టు గడ్డంతో సరికొత్తగా కనిపిస్తున్నాడు.