Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్‌లో కరుక్షేత్రం చూశారా?

Adhika Masa Purnima

Adhika Masa Purnima

Lenin Trailer : అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (LENIN). ఈ మూవీ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం వైజాగ్‌లో చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున , సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ సంగీతాన్ని అందించారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాగా ‘లెనిన్‌’ను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది.

ఈ ట్రైలర్ చూస్తే ధర్మరాజు, శ్రీరామాపురం, కురుక్షేత్రం వంటి పురాణ ప్రస్తావనలను ఆధునిక గ్రామీణ రాజకీయాలు, వర్గ పోరాటాలకు ముడిపెడుతూ దర్శకుడు మురళీ కిషోర్ ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించినట్లు అర్థమవుతోంది. ‘కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు..’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్, భారీ యాక్షన్ ఎపిసోడ్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ట్రైలర్‌లో అఖిల్ అక్కినేని రగ్గడ్ అండ్ మాస్ లుక్‌లో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగులు, చేసిన యాక్షన్ విన్యాసాలు అక్కినేని అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వీటికి తోడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన నటనతో, గ్లామర్‌తో మెప్పించనుంది. భారీ తారాగణంతో, అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.