Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenin Trailer : అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (LENIN). ఈ మూవీ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం వైజాగ్‌లో చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున , సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ సంగీతాన్ని అందించారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది.
ఈ ట్రైలర్ చూస్తే ధర్మరాజు, శ్రీరామాపురం, కురుక్షేత్రం వంటి పురాణ ప్రస్తావనలను ఆధునిక గ్రామీణ రాజకీయాలు, వర్గ పోరాటాలకు ముడిపెడుతూ దర్శకుడు మురళీ కిషోర్ ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించినట్లు అర్థమవుతోంది. ‘కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు..’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్, భారీ యాక్షన్ ఎపిసోడ్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ట్రైలర్లో అఖిల్ అక్కినేని రగ్గడ్ అండ్ మాస్ లుక్‌లో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగులు, చేసిన యాక్షన్ విన్యాసాలు అక్కినేని అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వీటికి తోడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన నటనతో, గ్లామర్‌తో మెప్పించనుంది. భారీ తారాగణంతో, అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.
Also Read
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
తాజావార్తలు
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!