NTV Telugu Site icon

Akhanda2 : ఆంధ్రాలో అఖండ -2 షూటింగ్.. ఎక్కడంటే..?

Akhanda

Akhanda

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన  ‘సింహ‌’, ‘లెజెండ్’, ‘అఖండ‌’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకరకంగా చెప్పాలంటే  అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. హ్యాట్రిక్ సినిమాలను ఫినిష్ చేసిన ఈ మాస్ పవర్ఫుల్ కాంబో  ‘అఖండ‌-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు.

Also Read : Sid Sriram : హైదరాబాద్‌లో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్.. ఎప్పుడంటే..?

తాజాగా అఖండ -2 షూటింగ్ ను ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జరుగుతున్న కుంభమేళాలో షూటింగ్ చేసాడు దర్శకుడు బోయపాటి శ్రీను. సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను అక్కడ షూట్ చేసాడు. ఈ షూటింగ్ లో సీనియర్ నటి శోభన తదితరులు పాల్గొన్నారు. కుంభమేళా షూటింగ్ ఫినిష్ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పడు ఏపీలో లొకేషన్స్ వేట సాగిస్తున్నాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం గుడిమెట్ల పరిసర ప్రాంతాలను బోయపాటి పరిశీలించాడు. అలాగే తడువాయి గ్రామాల వద్ద కొండ ప్రాంతాలను పరిశీలించాడు. త్వరలోనే ఇక్కడ షెడ్యూల్ ను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు బోయపాటి. తెలుగుతో పాటు పాన్ ఇండియా బాషలలో అఖండ -2 ను రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు  తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా  బాల‌య్య కుమార్తె తేజ‌స్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట‌-గోపీ అచంట ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.