Akhanda2 : ఆంధ్రాలో అఖండ -2 షూటింగ్.. ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఒకరకంగా చెప్పాలంటే అఖండ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ కు ఉపిరిపోసింది అనే చెప్పాలి. అంతటి సంచనల కాంబోలో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. హ్యాట్రిక్ సినిమాలను ఫినిష్ చేసిన ఈ మాస్ పవర్ఫుల్ కాంబో ‘అఖండ-2’ ని అధికారికంగా లాంచ్ చేసారు.
Also Read : Sid Sriram : హైదరాబాద్‌లో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్.. ఎప్పుడంటే..?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజాగా అఖండ -2 షూటింగ్ ను ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జరుగుతున్న కుంభమేళాలో షూటింగ్ చేసాడు దర్శకుడు బోయపాటి శ్రీను. సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను అక్కడ షూట్ చేసాడు. ఈ షూటింగ్ లో సీనియర్ నటి శోభన తదితరులు పాల్గొన్నారు. కుంభమేళా షూటింగ్ ఫినిష్ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పడు ఏపీలో లొకేషన్స్ వేట సాగిస్తున్నాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం గుడిమెట్ల పరిసర ప్రాంతాలను బోయపాటి పరిశీలించాడు. అలాగే తడువాయి గ్రామాల వద్ద కొండ ప్రాంతాలను పరిశీలించాడు. త్వరలోనే ఇక్కడ షెడ్యూల్ ను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు బోయపాటి. తెలుగుతో పాటు పాన్ ఇండియా బాషలలో అఖండ -2 ను రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా బాలయ్య కుమార్తె తేజస్వీని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..