బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు బాలయ్య. అదే ఊపులో తనతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరి కాంబోలో వచ్చిన అఖండ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 ను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు బోయపాటి.
Also Read : Indian 3 : భారతీయడు మరోసారి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు
బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన అఖండ 2 గ్లిమ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను పోటీ ఏర్పడింది. ఏరియాల వారీగా ఈ సినిమా రైట్స్ డీల్స్ ను క్లోజ్ చేస్తున్నారు మేకర్స్. ఆంధ్ర వారీగా చూస్తే.. సీడెడ్ – శోభన్, నెల్లూరు – కావలి భరత్, గుంటూరు మరియు ఓవర్సీస్ – రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ మరియు తమిళనాడు – నాని వెంకట్, ఈస్ట్ గోదావరి – విజయలక్ష్మి సినిమాస్, కర్నాటక – కుమార్ ఫిల్మ్స్.. ఇక పశ్చిమ గోదావరి, ఉత్తరాంద్ర, నైజాం ఏరియాలు డీల్స్ చర్చల దశలో ఉన్నాయి. బాలయ్య – బోయపాటి కాంబోకు ఉన్న క్రేజ్ తో అఖండ 2 రైట్స్ కు గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నేటి నుండి జూలై 10వరకు జరగనున్న షెడ్యూల్ లో రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసారు. మిగిలిన రెండు పాటలు జూలై చివరి వారం నుంచి ఆగస్టు 10పూర్తి చేసి సెప్టెంబర్ 25న రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.