తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. వింటేజ్ అజిత్ ను మరోసారి చూసామాని ఫ్యాన్స్ ఈ సినిమా సక్సెస్ ను ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిందంటే ప్యూర్ అజిత్ మాస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఇప్పుడు అజిత్ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై చర్చ నడుస్తోంది.
అయితే అజిత్ టాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అని తమిళ సినీ వర్గాల సమాచారం. గతేడాది దుల్కర్ సల్మాన్ కు లక్కీ భాస్కర్ తో సెన్సేషన్ హిట్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. ఈ సినిమాతో తొలిసారి దుల్కర్ ను వంద కోట్ల క్లబ్ లో చేరాడు దుల్కర్. అయితే ఇప్పుడు అజిత్ కోసం వెంకీ అట్లూరి ఓ స్టోరీ లైన్ ను అజిత్ కు వినిపించాడని అందుకు అజిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది. కాగా వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య తో సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న వెంకీ ఈ సినిమాను చక చక ఫినిష్ చేసాక అజిత్ తో సినిమాను స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. అజిత్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడట. వెంకీ అట్లూరి బ్యాక్ టు బ్యాక్ తమిళ హీరోలతోనే సినిమాలు చేయడం వెనక మతలబు ఏమిటో ఆయనకే తెలియాలి.