Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 33 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఎమోషనల్ నోట్ ను రిలీజ్ చేశారు. ఇందులో తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు అజిత్. నేను సినిమాల్లోకి వచ్చి 33 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నా వెన్నంటే ఉన్న అభిమానులకు స్పెషల్ థాంక్స్. మీరు లేకుంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. నా కెరీర్ అంత నార్మల్ గా సాగలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చాను. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నా. నటుడిగా మారాక ఎన్నో అడ్డంకులు వచ్చాయి. వాటన్నింటినీ దాటుకుని ముందుకు సాగాను. ఇక ముందుకు సాగలేను అనుకున్న ప్రతిసారి మీ ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది అంటూ తెలిపాడు అజిత్.
Read Also : Kingdom : కింగ్ డమ్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
కెరీర్ లో ఎన్నో సార్లు కిందపడ్డాను. అలా పడిపోతున్న ప్రతిసారి పడిలేచిన కెరటంలా దూసుకెళ్లేందుకే వర్క్ చేస్తున్నాను. కార్ రేసింగ్ లోకి వెళ్లినప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు వచ్చాయి. చాలా మంది నన్ను ముందకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నన్ను తొక్కేయాలని ఘోరంగా అవమానించారు. కానీ వాటిని దాటుకుని ఈ రోజు అవార్డులు సాధించే స్థాయికి నేను వచ్చానంటే మీ ప్రేమ వల్లే సాధ్యం అయింది. నా భార్య షాలిని లేకుంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. ఆమె అన్ని వేళల్లో నా వెంటే ఉండేది. ఆమెకు చాలా స్పెషల్ థాంక్స్ అంటూ రాసుకొచ్చాడు అజిత్.
Read Also : Heroine : మహేశ్ బాబు ఎత్తుకున్న ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్..