NTV Telugu Site icon

Valimai special screening : అజిత్ పేరెంట్స్ రివ్యూ… ఎలా ఉందంటే?

Valimai

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” ఫిబ్రవరి 24న వెండితెరపైకి రానుంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో అజిత్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడు. అయితే సినిమా విడుదలకు ముందు అజిత్ కుమార్ తన తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. వారి రివ్యూ ఏంటి ? వాళ్ళు ఎలా స్పందించారు ? అన్న విషయాన్ని ‘వాలిమై’ దర్శకుడు హెచ్ వినోద్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. మా అమ్మా నాన్నల కోసం, నా కుటుంబం కోసం ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను నిర్వహిస్తాను’ అని అజిత్ చెప్పుకొచ్చినట్టుగా డైరెక్టర్ వెల్లడించారు. ఇక వారి స్పందన చూసిన తర్వాతే చిత్ర నిర్మాత బోనీ కపూర్ ‘వాలిమై’ని హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో భారీగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

Read Also : BheemlaNayak : తమన్ కు పవర్ ఫుల్ హగ్… పిక్ వైరల్

దర్శకుడు వినోద్ ఇంకా మాట్లాడుతూ “వాలిమై యాక్షన్ చిత్రం మాత్రమే కాదు. సామాజిక అంశాల గురించి కూడా చెప్పే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిది” అని అన్నారు. చెన్నైకి బదిలీ అయిన ఒక పోలీసు అధికారి ప్రపంచమే ‘వాలిమై’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఇప్పటికే అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచిన ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది.