తల అజిత్… ఈ పేరు వినగానే కోలీవుడ్ బాక్సాఫీస్ ని ఏలుతున్న ఒక సూపర్ స్టార్ గుర్తొస్తాడు. మిగిలిన హీరోల్లా స్టైల్ కి పోకుండా సింపుల్ గా ఉండే మనిషి గుర్తొస్తాడు. అభిమాన సంఘాలని, సినిమా ఈవెంట్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి బాధ్యతగా బ్రతకండి అని అభిమానులకి ఒక సూపర్ స్టార్ పిలుపునిచ్చాడు అంటే అజిత్ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ గా, తనని ఒక నార్మల్ హీరోగా మాత్రమే చూసి ఎంజాయ్ చెయ్యండి అంతే కానీ ఫ్యాన్ వార్స్ కి వెళ్లకండని అజిత్ తరచుగా చెప్తూ ఉంటాడు. ఇలా చెప్పే హీరో ఏ ఇండస్ట్రీలో ఉండడేమో. అంతలా అభిమానుల గురించి ఆలోచించే అజిత్, దళపతి విజయ్ కి ఉన్న ఏకైక స్ట్రాంగ్ కాంపిటీషన్. పీక్ స్టేజ్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న అజిత్ ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. జనరల్ గా సోషల్ మీడియాలో ఏదైనా సినిమా గురించి ట్రెండ్ చెయ్యాలి అంటే ఒక అప్డేట్ ఉండాలి, లేదా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండాలి. ఈ రెండు లేకున్నా సోషల్ మీడియాలో ఒక పేరు ట్రెండ్ అవుతుంది అంటే అజిత్ కుమార్ కి మాత్రమే సాధ్యం.
అజిత్ కుమార్ అకా AK అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వని రోజు ఉండదు, అంతలా ‘తల’ ఫాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. తాజాగా అజిత్ ఫాన్స్ చేస్తున్న ట్రెండ్ ‘AK 62’. ఇటివలే తునివు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అజిత్. ఈ మూవీ అయిపోగానే అజిత్ తన నెక్స్ట్ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేస్తున్నాడు. మగిళ్ తిరుమేణి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి కోలీవుడ్ మీడియాలో ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మే 1న బయటకి రాబోతుందట. అజిత్ బర్త్ డే రోజున AK 62 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసి, వీలైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లిపోవడానికి లైకా ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తుందట. ఈ వార్త బయటకి రావడంతో ఫాన్స్ సోషల్ మీడియాలో AK 62 ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే 1న అజిత్ బర్త్ డే అండ్ AK 62 అనౌన్స్మెంట్ ని ఫాన్స్ కలిపి ఏ రేంజులో సెలబ్రేట్ చేస్తారో చూడాలి.