దాదాపు అయుదు నెలలుగా తల అజిత్ ఫాన్స్ ఎప్పుడెప్పుడు బయటకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేసిన ‘AK 62’ అప్డేట్ బయటకి వచ్చేంది. మే 1న తల అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ‘AK 62’ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మగిళ్ తిరుమేణి డైరెక్ట్ చేస్తున్నాడు. మే డే రోజున ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ… AK 62కి ‘విడ ముయర్చి’ ని ఫిక్స్ చేశారు. “ప్రయత్నాలు ఎప్పుడు విఫలం కావు” అనే క్యాప్షన్ కూడా ఇచ్చి, టైటిల్ పోస్టర్ ని లాంచ్ చేశారు. హ్యాపీ బర్త్ డే అజిత్ కుమార్ అంటూ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ… ‘విడ ముయర్చి’ ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు.
Read Also: Anil Sunkara: తప్పు చేశాం.. క్షమించండి.. ‘ఏజెంట్’ ఫెయిల్యూర్ ను ఒప్పుకున్న నిర్మాత
‘విడ ముయర్చి’ అంటే ‘పట్టుదల’ అని అర్ధం. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ లో అజిత్ పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ పై భారి అంచనాలు ఉన్నాయి. నిజానికి AK 62 సినిమాకి నయనతార భర్త విజ్ఞేశ్ శివన్ డైరెక్షన్ చెయ్యాల్సి ఉంది కానీ స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అవ్వకపోవడంతో అది మగిళ్ చేతికి వచ్చింది.