Ajay Gadu: జీ5లో ఫ్రీగా ‘అజయ్‌గాడు’ సినిమా స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Karthurvar’s Ajay Gadu streaming on ZEE5 as Sankranti Special: ఇప్పటికే పలు చిత్రాలను ఆడియెన్స్‌కు అందించిన జీ 5 ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ మూవీగా ‘అజయ్‌గాడు’ సినిమాను అందిస్తోంది. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో అజయ్ కర్తుర్వర్ నిర్మించారు. అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై చందన కొప్పిశెట్టి సంయుక్తంగా నిర్మించారు. అజయ్ కర్తుర్వర్ ప్రధాన పాత్రలో నటించిన ‘అజయ్‌గాడు’ సినిమాలో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ భానుశ్రీ, రోడీస్ విన్నర్ శ్వేత మెహతా కీలక పాత్రల్లో నటించారు. ప్రాచీ టక్కర్, అభయ్ బేతిగంటి, జయశ్రీగారు, యద్దం రాజు తదితరలు ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు. అజయ్ గాడు సినిమా అజయ్ అనే వ్యక్తికి సంబంధించిన కథ. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అజయ్. రోజురోజుకీ మారిపోతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, డబ్బు, పేరు, ప్రేమ వంటి వాటిని తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. వీటన్నిటినీ వదిలేయాలనుకున్న అతను ఒకానొక సందర్భంలో శ్వేతను స్ఫూర్తిగా ప్రేమిస్తాడు అయితే ఆమె డ్రగ్స్‌కి బానిస అయిన మెడికో. అలాంటి ఆమెను సక్రమ మార్గంలో ఉంచటానికి చేసే ప్రయత్నాల్లో బాహ్య ప్రపంచంతో అజయ్ ఎలాంటి యుద్ధం సాగించాడనేదే కథ.
Jamie Lever: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ కమెడియన్ కూతురు
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
ఈ సినిమా జనవరి 12 నుంచి జీ5లో ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా అజయ్ కర్తుర్వర్ మాట్లాడుతూ ‘‘ఒక సినిమాలో నటిస్తూ, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేయడం మామూలు విషయం కాదు. చాలా థ్రిల్లింగ్ జర్నీ. ఈ ప్రాజెక్టుకు నా మనసులో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, ఈ అద్భుతమైన అనుభవాన్ని ప్రతి ఒక్కరితోనూ పంచుకోవాలని అనుకుంటున్నా. సినిమా కథ ఎలా ఉంటుందో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కానీ సినిమాలో అంతకు మించిన విషయాలు చాలా ఉంటాయి. స్టంట్స్, ఎమోషన్స్, రొమాన్స్ వీటన్నిటిని కలగలిపి అద్భుతంగా తెరకెక్కించాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు ఈ సినిమాను అందించడమే నా ధ్యేయం. జీ5తో కలిసి ఈ సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అజయ్‌గాడు సకుటుంబంగా చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరికీ నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి. ఈ అద్భుతమైన సినిమాను ప్రేక్షకులతో కలిసి ఆస్వాదించాలని అనుకుంటున్నానని అన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!