Ajay Ghosh : ఓజి సినిమాలో నా పాత్ర అలా ఉండబోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG).టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు పవన్ కల్యాణ్ బర్త్ డే కానుకగా అభిమానుల కోసం ‘ఓజీ’ సినిమా నుంచి తాజాగా వీడియో గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.’పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాన్ గుర్తుందా. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుపాన్ కడగకలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే..’ అంటూ దాదాపు 101 సెకన్ల నిడివితో కూడిన గ్లింప్స్ అర్జున్ దాస్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో విడుదలైంది. పవన్ కళ్యాణ్ కు బర్త్డే విషెస్ చెబుతూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్‌తో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ అందించారు మేకర్స్… ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించనుంది.
ప్రస్తుతం ఓజి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా స్టయిలిష్ లుక్‌లో సరికొత్తగా కనిపిస్తున్నారు..తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న నటుడు అజయ్ ఘోష్ ఓజి సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు.అజయ్ ఘోష్ మాట్లాడుతూ…ఓజీ చిత్రంలో తాను ఒక రిటైర్డ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే తనతో పాటు మొట్టై రాజేంద్ర, జీవా వంటివారు కూడా కనిపిస్తారని తెలిపారు.తాము రిటైర్ అయ్యి ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా ఎంతగానో బిల్డప్ ఇస్తూ ఎంతగానో నవ్విస్తామని ఆయన తెలిపారు.. అలాగే కొద్దిగా విలినిజం కూడా ఉంటుందని ఆయన తెలిపారు..ఆయనకు పవన్ కళ్యాణ్ తో కొన్ని సీన్స్ కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.ప్రస్తుతం అజయ్ ఘోష్ తెలిపిన ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- Tags
- #OG
- #pawanklayan
- ajay ghosh
- Sujeeth
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!