Aishwarya Rajesh: ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది: ఐశ్వర్యా రాజేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయం అక్కర్లేదు.. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. దీంతో టాలీవుడ్ లో ఈ అమ్మడుకి ఆఫర్‌లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే సెలబ్రేటీలకి బ్రెకప్‌లు కామన్ విషయం. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతారు. ఇలాంటి జంటలను మనం చాలా మందిని చూశాం. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య కూడా తన బ్రేకప్ విషయాలు పంచుకుంది.
ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘ప్రేమ కంటే అది బ్రేక్ అయినప్పుడు వచ్చే బాధ అంటే నాకు ఎంతో భయం. నేను చాలా ఎమోషనల్ అమ్మాయిని. ప్రేమించే సమయం కంటే ప్రేమ నుంచి బయటకు వచ్చేందుకు నేను ఎక్కువ సమయం తీసుకుంటాను. గతంలో నేను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. సినిమాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో ఒక వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను. అలాగే అతని నుంచి వేధింపులు కూడా ఎదుర్కొన్నా. అంతకంటే ముందు కూడా ఒకసారి అలాంటి ప్రేమను చూశా. అసలు రిలేషన్‌షిప్‌లో ఇలా ఎందుకు జరుగుతుంది అని భయపడ్డా. అందుకే ఇప్పుడు రిలేషన్‌షిప్‌ని అక్సెప్ట్ చేయడానికి ఎంతో ఆలోచిస్తున్నాను’ అంటూ తెలిపింది. అంతే కాదు ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ గురించి కూడా మాట్లాడుతూ ‘ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడే భాగ్యం కోసం అనిల్ రావిపూడి నా పేరు చెప్పినప్పుడు. తనైతే చాలా ఈజీగా చేస్తుంది అంటూ వెంకటేష్ చాలా సపోర్ట్ చేశారు. ఇంత కామెడీ ఉన్న రోల్ చేయడం నా సినీ కెరియర్‌లో ఇదే మొదటిసారి. మహేష్ బాబు మమ్మల్ని ఇంటికి ఆహ్వానించారు ‘ఏవయ్యా అనిల్ ఈ పిల్లని ఎక్కడ పుట్టావు’ అని అన్నారు. నేను జీవితంలో ఇంతవరకు రావడానికి మా అమ్మే కారణం’ అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య.
Also Read
తాజావార్తలు
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
-
Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
-
India’s Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు? FAS నివేదికలో సంచలన వివరాలు
-
Sheetal Devi: శీతల్ దేవి సంచలనం.. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో తొలి వ్యక్తిగత ‘స్వర్ణం’ కైవసం.!
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?