Aishwarya Rai is living separately from the Bachchan family: ఐశ్వర్య రాయ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే తన అంద చందాలతోనే కాదు నటనతో దేశ వ్యాప్తంగా కూడా ఆమె అభిమానులను సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్‌లో ఉండగా చాలా మంది హీరోలతో సన్నిహితంగా ఉంటూ వారిని వివాహం చేసుకుంటుందని అనిపించేలా చేసినా చివరికి అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కూమార్తె కూడా ఉంది, ఆరాధ్య. అయితే ఇంత కాలం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తూ వచ్చిన ఈ జంట విడిపోయారని ఓ రూమర్ సోషల్ మీడియాలో గత కొంత కాలంగా హల్ చల్ చేస్తున్న సంగతి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి తెలుసు. ఇక ఈ రూూమర్స్‌కు నిజం చేకూర్చుతూ ఐశ్వర్య రాయ్, అమితాబ్ ఇంటి నుంచి ఖాళీ చేసేసి బయటకు వచ్చిందని అంటున్నారు.
Koose Munisamy Veerappan Review: వీరప్పన్ మంచివాడా చెడ్డవాడా? ఆయనే ఒప్పుకున్న నిజం ఇదే!
నిజానికి ఈ మధ్య అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్య రాయ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో ఈ విడాకుల పుకారు మొదలైంది. ఇక తాజాగా “అభిషేక్ – ఐశ్వర్య ఇప్పటికీ కలిసి ఉండటం వారి బిడ్డ కోసమే, ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు విషయాలు ఒక కొలిక్కి వచ్చాయి” అని బచ్చన్ కుటుంబానికి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఐశ్వర్య, జయా బచ్చన్ మధ్య చాలా సమస్యలు ఉన్నాయని ఈ కారణంగానే ఐశ్యర్య ఇంటి నుంచి బయటకు వచ్చిందని కూడా అంటున్నారు. బచ్చన్ల కుమార్తె శ్వేత శాశ్వతంగా బచ్చన్ల నివాసం జల్సాలోకి షిఫ్ట్ అవడం కూడా ఐశ్వర్య – ఆమె అత్తమామల మధ్య అప్పటికే ఉన్న అస్థిర పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ జంట దూరంగానే ఉన్నా ఇప్పట్లో వీరి విడాకులు మాత్రం ఉండవని అంటున్నారు.