NTV Telugu Site icon

NTR 30: వాళ్లు మొదలుపెడితే మాములుగా ఉండడు… మొదలెట్టేసార్రా బాబు…

Ntr 30

Ntr 30

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ సమయంలో ఇండియాలో కాకుండా అమెరికాలో ఎన్టీఆర్ ఫాన్స్ సత్తా చూపిస్తూ ‘ఎయిర్ ప్లేన్ బ్యానర్’ని ఎగరేసారు. ఎన్టీఆర్ చెప్పిన ‘తొక్కుకుంటూ పోవాలే’ అనే బ్యానర్ ని అమెరికా ఆకాశంలో ఎగరేసిన ఫాన్స్, సాలిడ్ ప్రమోషన్స్ చేశారు. ఇలాంటి ఫాన్స్ కూడా ఉంటారా, అసలు ఇది సీడెడ్ గడ్డనా లేక అమెరికానా అనే అనుమానం తెచ్చే రేంజులో ఫ్యాన్యిజం చూపిస్తూ… ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకే హీరోకి ఉండవేమో అనిపించే రేంజులో ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా చేశారు. ఇప్పుడు అలాంటి సీన్ ని రిపీట్ చేస్తూ ఎన్టీఆర్ ఫాన్స్ మరోసారి వరల్డ్ సినిమా హార్ట్ లాంటి ‘హాలీవుడ్’లో ఎయిర్ ప్లేన్ బ్యానర్ ని ఎగరేసారు. “Thankyou NTR. Can’t Wait for NTR 30” అంటూ బ్యానర్ ని హాలీవుడ్ పై ఎగరేసారు ఎన్టీఆర్ అమెరిక ఫాన్స్.

మార్చ్ 23న ముహూర్తంతో లాంచ్ చెయ్యనున్న ‘ఎన్టీఆర్ 30’కి ఆల్ ది బెస్ట్ చెప్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ లని విష్ చేస్తూ ఫాన్స్ చేసిన ఈ ఫీట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సముద్రాల అవతల ఉన్న ఫాన్స్ చేసిన హంగామాని ఇండియాలోని ఎన్టీఆర్ ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మూవీ లాంచ్ కే ఇలా ఉంటే 2024 ఏప్రిల్ 5న ‘ఎన్టీఆర్ 30’ రిలీజ్ రోజున ఇంకెలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అనే రేంజులో ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 5న హాలీవుడ్ ని ఎరుపు రంగుతో కప్పెస్తాం అంటూ అమెరిక ఎన్టీఆర్ ఫాన్స్ ట్వీట్ చేశారు. మరి ఆ రోజు ఎన్టీఆర్ ఫాన్స్ అమెరికాలో ఇంకేం చేస్తారో చూడాలి.