Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahaan Panday Next Movie with Ali Abbas Zafar: బాలీవుడ్లో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్)కు ప్రస్తుతం వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ‘వార్ 2’, ‘ఆల్ఫా’, ‘మర్దానీ 3’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాల కంటే కొత్త జంటలు, విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఈ క్రమంలో ‘సైయారా’తో సంచలన విజయం అందుకున్న అహాన్ పాండేను మరోసారి రంగంలోకి దించుతోంది.
మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ‘సైయారా’ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ మ్యూజికల్ లవ్‌స్టోరీ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని అందుకుంది. రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయంతో అహాన్ పాండేకు బాలీవుడ్లో మంచి గుర్తింపు లభించింది. మరోవైపు ఆ తర్వాత విడుదలైన ‘వార్ 2’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా.. సైయారా ఇచ్చిన ఊపుతో యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు కొంత ఊరట లభించింది. దీంతో అహాన్‌తో మరో సినిమా చేయాలని నిర్మాణ సంస్థ నిర్ణయించింది.
Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
సైయారా విజయం తర్వాత అహాన్ పాండేకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి. దాదాపు పది కథలను పరిశీలించిన అనంతరం ఆయన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి ‘బేపర్వా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో శర్వరి కథానాయికగా నటిస్తోంది. యాక్షన్, రొమాన్స్ కలగలిసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలీ అబ్బాస్ గతంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో కలిసి విజయవంతమైన చిత్రాలను అందించారు. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘బడే మియాన్ చోటే మియాన్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయినప్పటికీ అలీ గత విజయాలను దృష్టిలో ఉంచుకుని ఆదిత్య చోప్రా మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. భారీ చిత్రాలపై పెట్టుబడులు పెట్టి ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతున్న యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు బేపర్వా కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!