Site icon NTV Telugu

Unstoppable 2: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ ఎపిసోడ్.. నిమిషాల్లోనే క్రాష్ అయిన ఆహా

Balayya

Balayya

Unstoppable 2: ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్ మొదటిసారి గెస్ట్ గా వచ్చాడు. గత కొన్నిరోజుల క్రితం షూటింగ్ జరిగినా ఆహా మేకర్స్ మాత్రం అభిమానులను ఊరిస్తూ ఊరిస్తూ కొత్త ఏడాది కానుకగా డిసెంబర్ 30 న మొదటి పార్ట్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా అభిమానులు గోల చేస్తుండడంతో ఒకరోజు ముందే ఆహాలో ప్రభాస్ ఎపిసోడ్ ను స్ట్రీమ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనుకున్నట్లుగానే కొద్దిసేపటి క్రితం అనగా ఈరోజు రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది.

ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని ఆహా ముందే కూర్చున్న అభిమానులు టైమ్ అవ్వగానే ఒక్కసారిగా క్లిక్ చేయడంతో ఆహా యాప్ క్రాష్ అయ్యింది. ఓవర్ లోడ్ కావడంతో ఎపిసోడ్ ఆగిపోయింది. దీంతో ఆహా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అంతరాయానికి చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.. ” డార్లింగ్ ప్రభాస్ అభిమానుల ప్రేమతో ఓవర్‌లోడ్ అవ్వడం వలన మా యాప్ క్రాష్ అయిందని మీకు తెలియజేయడానికి క్షమించండి..మేము దానిపై పని చేస్తున్నాము.. త్వరలోనే మేము ముందుకు వస్తాం” అని తెలిపింది. దీంతో అభిమానుల గుండెలు బద్దలైయిపోయాయి. మరోసారి వారికి నిరాశే ఎదురయ్యింది. మళ్లీ ఈ ఎపిసోడ్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూడక తప్పడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/ahavideoIN/status/1608492424091029507?s=20&t=5czl63ncb2Kgo1JEDiE7ow

Exit mobile version