Site icon NTV Telugu

RRR : ఎన్టీఆర్ కు బిగ్ రిలీఫ్… చెర్రీకి టెన్షన్ తప్పదు!

ntr and ram charan

RRR ఎట్టకేలకు తెరపైకి వచ్చి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు ముందురోజు వరకూ ఇండియా వైడ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూస్తే వాళ్ళు పడిన కష్టానికి ఫలితం దక్కినట్టే అన్పిస్తోంది. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సినిమా విడుదలై, రెస్పాన్స్ వచ్చే వరకూ కాస్త టెన్షన్ గానే ఉంటుంది. కానీ పాజిటివ్ టాక్ రావడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు బిగ్ రిలీఫ్ దక్కినట్టే. ముఖ్యంగా ఎన్టీఆర్ కు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి కాస్త గ్యాప్ దొరికినట్టే ! మరి రామ్ చరణ్ సంగతి ఏంటి ?

Read Also : RRR : థియేటర్లో పేపర్లు విసిరేస్తూ ఉపాసన రచ్చ… వీడియో వైరల్

చెర్రీకి టెన్షన్ తప్పదు… ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ టెన్షన్ తప్పినప్పటికీ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ “ఆర్సీ 15” షూటింగ్ లో పాల్గొనాలి. ఒక్క ఈ సినిమానే కాదు… ఏప్రిల్ 29న మెగాస్టార్ “ఆచార్య” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక త్వరలో ప్రారంభం కానున్న “ఆచార్య” హంగామాలో, ప్రమోషన్స్‌లో చరణ్ ముందుండాలి. చెర్రీ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించడమే కాకుండా నిర్మిస్తున్నాడు కూడా. అంతేకాకుండా మేకర్స్ ‘ఆచార్య’ను హిందీలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ కు మంచి క్రేజ్, ఎక్స్పోజర్ వచ్చింది. కాబట్టి చరణ్ పైనే ఎక్కువ భారం పడుతుంది. ఇన్ని పనులు ఉంటే చెర్రీకి విశ్రాంతి తీసుకునే సమయం ఎక్కడ ఉంటుంది ? అందుకే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు స్టార్ట్ చేయడానికి ముందుగానే చరణ్ తన భార్య ఉపాసనతో ఓ షార్ట్ వెకేషన్ ను వెళ్లి వచ్చాడు.

Exit mobile version