మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్‌ను టేకోవర్ చేసుకోబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించింన ‘బ్రో’ మూవీ జూలై 28న థియేటర్లోకి రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి ఏ సినిమా రాబోతోంది? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. అయితే హరిహర తప్ప ఉస్తాద్, ఓజి సినిమాలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా ఓజి స్పీడ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. సాహో తర్వాత పవర్ ఫుల్ గ్యాంగ్ డ్రామాగా సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ టాలెంట్‌కు మరింత బూస్టింగ్ ఇస్తూ దూసుకుపోతోంది డివివి ఎంటర్టైన్మెంట్స్.
Read Also: Rajinikanth: సర్ ఇంతకీ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారా? లేక ఆపేస్తున్నారా?
ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్‌లో ఓజి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా రోజులుగా వినిపిస్తోంది. ఒకవేళ డిసెంబర్ మిస్ అయితే.. నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌లో ఓజి రావడం పక్కా అంటున్నారు. ఉస్తాద్, హరిహర వీరమల్లు లైన్లో ఉన్నా.. ఓజి ఈ సినిమాలను ఓవర్ టేక్ చేసి థియేటర్లోకి దూసుకురావడం పక్కా అంటున్నారు. ఎందుకంటే.. తాజాగా ఈ సినిమాకు ఓవర్సీస్ డీల్ కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఓజికున్న క్రేజ్‌తో డబుల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. భీమ్లా నాయక్ సినిమాకు 9 కోట్ల డీల్ జరిగితే… ఇప్పుడు ఓజికి ఏకంగా 18 కోట్ల ఓవర్సీస్ బిజినెస్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఓజి బాక్సాఫీస్ లెక్కలు ఏ రేంజులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.