వరల్డ్ సినిమాలో ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ప్రతి సినీ అభిమాని నుంచి వచ్చే ఒకేఒక్క ఐకానిక్ క్యారెక్టర్ పేరు ‘హెన్రీ వాల్టన్’. ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ 80’ల నుంచి ఇప్పటివరకూ సినీ అభిమానులని ‘ఇండియానా జోన్స్’ సినిమాతో అలరిస్తూనే ఉన్న ఉంది. ‘ఇండియానా జోన్స్’ ది బెస్ట్ అడ్వెంచర్ సినిమా ఎవర్ మెడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా అనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి మాటల్లో ‘ఇండియానా జోన్స్’ వినిపించే అంతగా ఇంకో సినిమా పేరు వినిపించదు. అంతలా జక్కన్నని మెప్పించిన ‘ఇండియానా జోన్స్’ సినిమాల్లో అసలు ఏముంటుంది అనేది తెలియాలి అంటే ఈ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న ఐదో సినిమా ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయిల్ ఆఫ్ డెస్టినీ’ సినిమా చూసేయాల్సిందే. ఇప్పటికే రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసి, వింటేజ్ వైబ్స్ ని క్రియేట్ చేసిన మేకర్స్ 2023 జూన్ 29న ఆడియన్స్ కి చూపించడానికి రెడీ అవుతున్నారు. అదేంటి జూన్ 30న కదా ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయిల్ ఆఫ్ డెస్టినీ’ రిలీజ్ డేట్, తప్పు చెప్తున్నారు అనుకోకండి. మన ఆడియన్స్ కి మాత్రమే స్పెషల్ గా ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయిల్ ఆఫ్ డెస్టినీ’ సినిమాని ఒక రోజు ముందే అంటే జూన్ 29నే ఆడియన్స్ ముందుకి తీసుకోని వస్తున్నట్లు ‘వాల్ట్ డిస్నీ ఇండియా’ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దీంతో ప్రపంచం ఈ అడ్వెంచర్ వీరుడిని చూడడం కన్నా ఒక రోజు ముందే మనకి చూసే ఛాన్స్ దొరికేసింది.
డాక్టర్ ‘హెన్రీ వాల్టన్’ అనే ఫిక్షనల్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ చేసే అడ్వెంచర్స్ ని చూపించే సినిమా ‘ఇండియానా జోన్స్’. ఈ అడ్వెంచర్ డ్రామాలో టైటిల్ రోల్ ని ‘హర్రిసన్ ఫోర్డ్’ ప్లే చేస్తున్నాడు. వరల్డ్స్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన ‘స్టీఫెన్ స్పీల్ బర్గ్’ రూపొందించిన ఈ అమెరికన్ ఫ్రాంచైజ్ లో ఇప్పటివరకూ నాలుగు సినిమా వచ్చాయి. మొదటిది ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ అనే పేరుతో 1981 జూన్ 12న రిలీజ్ అయ్యింది. సెకండ్ సినిమా ‘ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్’ 1984 మే 23న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రెండో సినిమా వచ్చిన అయిదేళ్లకి మూడో సినిమా ‘ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ 1989 మే 24న విడుదలయ్యింది. అప్పట్లో మూడో సినిమాతోనే ‘ఇండియానా జోన్స్’ ఎండ్ అయిపోయిందని అంతా అనుకున్నారు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత 2008 మే 22న ‘ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ అఫ్ ది క్రిస్టల్ స్కల్’ పేరుతో నాలుగో సినిమా బయటకి వచ్చింది. ‘ఇండియానా జోన్స్’ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ఈ నాలుగు సినిమాలు కొన్ని దశాబ్దాలుగా సినీ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి ఐదో సినిమాగా ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయిల్ ఆఫ్ డెస్టినీ’ వస్తోంది. హర్రిసన్ ఫోర్డ్ ని ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇండియానా జోన్స్ సినిమాలో హెన్రి వాల్టన్ పాత్రలో చూడడం నాస్టాల్జిక్ ఫీలింగ్ కలిగించనుంది. మొదటి నాలుగు సినిమాలని తెరకెక్కించిన ‘స్టీఫెన్ స్పీల్బర్గ్’ ఈ 5వ సినిమాని రూపొందించలేదు. ‘ది వోల్వరేన్’, ‘లోగన్’, ‘ఫోర్డ్ vs ఫెరారీ’ సినిమాలని డైరెక్ట్ చేసిన ‘జేమ్స్ మాన్గోల్డ్’ ఇండియానా జోన్స్ 5వ సినిమాని డైరెక్ట్ చేశాడు. ‘స్పీల్ బర్గ్’ లేకుండా ‘ఇండియానా జోన్స్’ లో ఆ రేంజ్ మ్యాజిక్ ని ఉంటుందా అనే అనుమానం ప్రతి ఫ్రాంచైజ్ లవర్ లోనూ ఉంటుంది కానీ ఆ డౌట్స్ ని వదిలేసి థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చెయ్యండి అని మేకర్స్ చెప్తున్నారు. మరి జూన్ 29న ఈ ఎపిక్ అడ్వెంచర్ డ్రామా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.
Adventure awaits! Check out the brand-new character posters for #IndianaJones and the Dial of Destiny, only in cinemas June 29 in English, Hindi, Tamil & Telugu. pic.twitter.com/njkAehgmSL
— Walt Disney Studios (@DisneyStudiosIN) June 2, 2023