కామెడీ, యాక్షన్, డ్రామా, లవ్, పీరియాడిక్, సెమీ పీరియాడిక్, పేట్రియాటిక్, ఎమోషనల్ డ్రామా, థ్రిల్లర్, హారర్… ఇలా సినిమాలు ఎన్నో రకాల జానర్స్ లో తెరకెక్కుతూ ఉంటాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి తనకంటూ ప్రత్యేకమైన జానర్ క్రియేట్ చేసుకున్నాడు హీరో అడివి శేష్. ‘శేష్ జానర్’ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోని సినిమాలు చేస్తూ, ఆడియన్స్ కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్స్ ని ఇస్తున్నాడు ఈ యంగ్ హీరో. లో బడ్జట్, హై టెక్నీకల్ వాల్యూస్, ఇంటెన్స్ స్క్రీన్ ప్లే… శేష్ సినిమా ప్రత్యేకతలు. ఒక యంగ్ హీరోగా హాలీవుడ్ రేంజ్ సినిమాలు చెయ్యడం శేష్ కే చెల్లింది. గూఢచారి సినిమాతో తెలుగు ఆడియన్స్ చాలా రోజుల తర్వాత స్పై జానర్ లో పరిచయం చేసాడు శేష్. గూఢచారి సినిమా మోడరన్ తెలుగు ఫిల్మ్స్ లో పాత్ బ్రేకింగ్ అటెంప్ట్. ఇప్పుడు ఈ సినిమాకి భారీ సీక్వెల్ ని చేస్తున్నాడు అడివి శేష్. ‘త్రినేత్ర’ ఏజెన్సీలో గూఢచారి అయిన అడివి శేష్, పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నాడు.
ఈ మూవీ సెట్స్ పై ఉండగానే శేష్ నుంచి మరో అనౌన్స్మెంట్ వచ్చేసింది. స్ట్రెయిట్ హిందీ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ ఇస్తూ శేష్exశృతి అంటూ అడివి శేష్ ట్వీట్ చేసాడు. శృతి హాసన్ మొదటిసారి శేష్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ పాన్ ఇండియా మూవీని షానీల్ దేవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. శేష్ తో ఎక్కువ రోజులుగా ట్రావెల్ అవుతూ… క్షణం, గూఢాచారి లాంటి సినిమాలకు షానీల్ డీఓపీగా వర్క్ చేసాడు. డైరెక్టర్ గా డెబ్యూ అవుతున్న షానీల్, గతంలో లైలా అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఈ షార్ట్ ఫిల్మ్ అధికారికంగా ఎంపికైంది. ఈ తాజా పాన్ ఇండియా సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లేను షనీల్, అడివి శేష్ కలిసి చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ యార్లగడ్డ సినిమాను తెరకెక్కిస్తోంది. సునీల్ నారంగ్ సినిమాకు కోప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.