Hanuman: ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు షోస్ యాంకర్స్ మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు స్టార్ హీరోస్ హోస్టులుగా మారుతున్నారు. ఇక ఒక సినిమా ప్రమోషన్ అంటే.. చిత్ర బృందం మొత్తం కాలేజ్ టూర్లు అని, టీవీ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు అని, పండగ స్పెషల్ ఇంటర్వ్యూలు అని ఉండేవి. కానీ, ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది. క్రాస్ ఇంటర్వ్యూలు, స్టార్ హీరోలు,డైరెక్టర్లు యాంకర్లుగా మారి చిత్రబృందాన్ని ఇంటర్వ్యూ చేస్తూ.. హైప్ తెప్పిస్తున్నారు. క్రాస్ ఇంటర్వూస్ అంటే.. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే వారంలోనో.. ఒకే డేట్ లోనో రిలీజ్ అయితే.. ఇద్దరు కలిసి ఒక సినిమా గురించి ఇంకొకరు చెప్పడం.. ఇక స్పెషల్ ఇంటర్వూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరో కానీ, డైరెక్టర్ కానీ.. రిలీజ్ కాబోతున్న సినిమా టీమ్ ను ఇంటర్వ్యూ చేయడం.. ఈరోజు సలార్ చిత్ర బృందాన్ని రాజమౌళి ఇంటర్వ్యూ చేశాడు. దీనివలన ఇంటర్వ్యూ మీద ఆశకి పెరుగుతుంది.
ఇక ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యారు హనుమాన్ టీమ్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. కుర్ర హీరో అడివి శేష్.. హనుమాన్ టీమ్ ను ఇంటర్వ్యూ చేసాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. శేష్.. ప్రశాంత్ వర్మ మంచి ఫ్రెండ్స్.. అందుకే ఈ ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ఇంటర్వ్యూ స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ సినిమాకు శేష్ ప్రమోషన్స్ ఎలా వర్కవుట్ అవుతాయో చూడాలి.
