Aaditi Pohankar : సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు తెరపై చూడటానికి బాగానే ఉన్నా.. అందులో నటించే సమయంలో వారు పడే ఇబ్బందుల గురించి అప్పుడప్పుడు బయట పెడుతూనే ఉంటారు. అయితే తాజాగా ఓ స్టార్ యాక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి సీన్లలో అబ్బాయిలే ఎక్కువగా ఇబ్బంది పడుతారని తెలిపింది. సాధారణంగా రొమాంటిక్ సీన్లు అంటే అమ్మాయిలే ఇబ్బంది పడుతారనే టాక్ ఉంటుంది. అయితే బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆదితి పోహంకర్ మాత్రం తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె బాలీవుడ్ సీరియల్స్, సినిమాల్లో నటిస్తోంది.
Read Also : Rithu Chowdari : నడుము అందాలతో రీతూ చౌదరి రచ్చ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను బాబీ డియోల్ తో రొమాంటిక్ సీన్లలో నటించాను. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది కాబట్టి మేం పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ రొమాంటిక్ సీన్లలో అందరూ అనుకున్నట్టు అమ్మాయిలు కాకుండా అబ్బాయిలే ఇబ్బందులు పడుతుంటారు. నాతో చాలా మంది ఈ విషయం చెప్పారు. ఇలాంటి సీన్లు చేసేటప్పుడు యాక్టర్స్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటే బెటర్. అది ఇద్దరి మధ్య సీన్ బాగా వచ్చేందుకు దోహదపడుతుంది’ అంటూ తెలిపింది ఆదితి. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.