కొన్ని వందల కోట్లతో తెరకెక్కుతున్న సినిమాల బిజినెస్‌ను రెండు, మూడు నిమిషాల టీజర్, ట్రైలర్స్ డిసైడ్ చేస్తాయి. ట్రైలర్ బాగుంటే సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి, లేదంటే ఇక అంతే సంగతులు అనేలా ఉంది ప్రస్తుతం సినిమాల పరిస్థితి. నాని దసరా సినిమాను కొత్త డైరెక్టర్ తెరకెక్కించినప్పటికీ.. టీజర్, ట్రైలర్‌తోనే భారీ బిజినెస్ జరిగింది. అదే రేంజులో దసరా సినిమా కలెక్షన్స్ కూడా వచ్చాయి. అయితే ఆదిపురుష్ టీజర్ చూసిన తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. ఒకానొక సమయంలో ఆదిపురుష్‌ను కొనే వారే లేరా? అనేలా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆదిపురుష్ లెక్కలు తారుమారు అయిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీరిలీజ్ బిజినెస్ డీల్స్ చాలా వరకు క్లోజ్ అయిపోయాయని తెలుస్తోంది. టీజర్ సమయంలో అయిన బిజినెస్ లెక్కలని పూర్తిగా మార్చేస్తుంది ఆదిపురుష్ ట్రైలర్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆదిపురుష్ సినిమా మార్కెట్ మరింతగా పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హ్యూజ్ రెస్పాన్స్ ని రాబట్టడంతో సినిమాపై అంచనాలని అమతం పెంచేసింది ఆదిపురుష్ ట్రైలర్. అంచనాలే కాదు బిజినెస్ కూడా పెంచిందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.
గతంలో ఆదిపురుష్ సినిమాకి తెలుగులో వంద కోట్ల వరకూ డిమాండ్ ఉందని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు ట్రైలర్ టాక్‌తో ఒక్క తెలుగులోనే 150 కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తోంది. తెలుగులో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను డీల్ చేస్తోంది. వాస్తవానికైతే.. ప్రభాస్ రేంజ్‌కు ఇది పెద్ద నెంబరే కాదు. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. డబుల్, ట్రిపుల్ ప్రాఫిట్ రావడం పక్కా. టీ సీరీస్ సంస్థతో కలిసి ఓం రౌత్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్లు ఖర్చు చేశారు. ముందుగా 500 కోట్లు అనుకున్నప్పటికీ… గ్రాఫిక్స్ బెటర్మెంట్ చెయ్యడంతో అదనంగా మరో వంద కోట్లు పెట్టాల్సి వచ్చింది. దాని రిజల్టే ఇప్పుడు ఆదిపురుష్ ట్రైలర్ అని చెప్పొచ్చు. మరి ఓవరాల్‌గా ఆదిపురుష్ బిజినెస్ టార్గెట్ ఎంత వరకు ఉంటుందనేది చూడాలి.