Adipurush: ఫ్యాన్స్ సిద్ధంకండి.. టీజర్ వచ్చేస్తోంది.. ఆరోజే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush Teaser To Release On October 3: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఆదిపురుష్ ఒకటి. ఎప్పుడో భూమి పుట్టినప్పుడే ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది కానీ, యూనిట్ నుంచి ఇంతవరకూ ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. అప్పుడెప్పుడో ఒకసారి వీఎఫ్ఎక్స్ పనులు జోరుగా సాగుతున్నాయని, మరోసారి వచ్చే ఏడాది జనవరి 12న సినిమాని రిలీజ్ చేస్తామని రెండు అప్డేట్స్ వచ్చాయో తప్ప.. అంతకుమించి మరే వివరాలు వెల్లడి కాలేదు. ఆయా సందర్భాల్లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు కానీ, చివరికి అవి అడియాశలుగానే మిగిలిపోయాయి. ఫస్ట్ లుక్ కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలి? అంటూ కళ్లు కాయలు కాచేలా అభిమానులు వేచి చూస్తూనే ఉన్నారు.
అయితే.. ఇప్పుడు ఇంకెంతోకాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ కాదు, ఏకంగా టీజర్‌నే విడుదల చేయబోతున్నట్టు సమాచారం వచ్చింది. ‘‘దసరా సందర్భంగా శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలో నిర్వహించిన ఓ గ్రాండ్ ఈవెంట్‌లో ఆదిపురుష్ టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక అప్పటినుంచి విడుదల తేదీ (12-01-23) వరకు ఏకధాటిగా ప్రమోషన్ కార్యక్రమాల్ని చేపట్టనున్నారు’’ అంటూ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఫైనల్‌గా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండుగ చేసుకునే ఆ శుభ సందర్భం మరెంతో దూరం లేదని చెప్పుకోవచ్చు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మైథలాజికల్ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!