NTV Telugu Site icon

Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ

Adipurush Ticket Issue

Adipurush Ticket Issue

Adipurush Team Gives Clarity On Ticket Price Issue: ఆదిపురుష్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా నామజపమే! జూన్ 16వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్న ఈ సినిమా కోసం యావత్ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీనే అయినప్పటికీ.. ప్రస్తుత ఆధునిక యుగానికి తగ్గట్టు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో డైరెక్టర్ ఓమ్ రౌత్ ఈ ‘ఆదిపురుష్’ని రూపొందించాడు. దీంతో.. ఈ కొత్త ఫార్మాట్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ గ్యాప్‌లో ఈ సినిమాకి సంబంధించి ఓ తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని ఖండిస్తూ చిత్రబృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది.

Shocking Video: రైలు వస్తుంటే ఎదురెళ్లి.. పట్టాలపై పడుకున్న యువకుడు

‘ఆదిపురుష్’ ప్రదర్శించే ప్రతీ థియేటర్‌లోనూ.. హనుమంతుడికి ప్రత్యేకంగా ఒక సీటును కేటాయిస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే తెలిపారు. దీంతో.. ఆ సీటు పక్కనే తమకు సీటు దక్కేలా టిక్కెట్లు కొనాలని, చాలామంది సినీ ప్రియులు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే హనుమంతుడి సీటు పక్కన సీట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతిఒక్కరూ తమకు ఆ ఖాళీ సీటు పక్కనే కూర్చునే ఛాన్స్ రావాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే.. హనుమంతుడి సీటు పక్కన సీట్లకు టికెట్ ధర ఎక్కువ కేటాయిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇరువైపులా సీట్లకు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, వాళ్లకే ఆ సీట్లు దక్కుతాయన్నట్టుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆదిపురుష్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

East Godavari Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

‘‘ఆదిపురుష్ టికెట్ ధరలకు సంబంధించి, సోషల్ మీడియాలో ఓ తప్పుడు వార్త చక్కర్లు కొడుతోంది. హనుమంతుడికి రిజర్వ్ చేసిన సీటు పక్కన సీట్లకు ఎక్కువ ధరలు కేటాయిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇలాంటి తప్పుడు వార్తల్ని ఎవ్వరూ నమ్మొద్దు. జై శ్రీరామ్’’ అంటూ ఆదిపురుష్‌ని నిర్మిస్తున్న టీ సిరీస్ సంస్థ ట్విటర్ మాధ్యమంగా స్పష్టతనిచ్చింది. కాబట్టి.. ఎవ్వరూ ఆ సీట్ల కోసం ఎక్కువ డబ్బులు ఇవ్వొద్దు. కాగా.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ సినిమా.. జూన్ 16న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

Show comments