Site icon NTV Telugu

Adipurush: వైట్ లో రామయ్య.. బ్లాక్ లో సీతమ్మ.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదే

Prabhas

Prabhas

Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభమయ్యింది. తిరుపతిలోని తారకరామ స్టేడియం అత్యంత భారీగా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. జూన్ 16 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అభిమానుల ఆనందోత్సహా కేరింతల నడుమ ప్రభాస్ అయోధ్య సెట్ లోకి అడుగుపెట్టాడు. ఒక్కసారిగా ప్రభాస్ రాకతో స్టేడియం అంతా డార్లింగ్ నామస్మరణతో మారుమ్రోగిపోయింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో రామయ్య అద్భుతంగా కనిపించాడు. ఇక ముందు చెప్పినట్లుగానే ప్రభాస్ ఎంట్రీ అవ్వగానే AI టెక్నాలజీ ద్వారా ప్రభాస్ 50 అడుగుల కటౌట్ ను స్క్రీనింగ్ చేశారు. ఇక బాణాసంచాతో తిరుపతి మొత్తం వెలుగులు వెదజల్లి రాఘవ రాముడు వచ్చినట్టు తెలియజేసింది.

Adipurush Pre Release Event Live Updates : ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన తారకరామ స్టేడియం

ఇక సీతమ్మ.. కృతి సనన్ సైతం తన అందంతో ఆకట్టుకుంది. బ్లాక్ కలర్ చీరలో అద్భుతంగా మెరిసింది. వీరి రాకతో ఈవెంట్ మరింత మెరిసిపోయింది. ఇక కొద్దిసేపటి క్రితమే ఈవెంట్ ముఖ్య అతిథి చిన్న జీయర్ స్వామి వారు కూడా విచ్చేశారు. ప్రస్తుతం రాముడు, జానకి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరికొద్దిసేపటిలో జానకిరాములు స్టేజిపై కలిసి కనిపించనున్నారు. ఆ మూమెంట్ కోసమే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version