Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha: దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న అందాల భామ త్రిష. ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. 40 ఏళ్లు దాటినా ఇంకా సింగిల్‌గానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ .. తాజాగా తన పెళ్లి, వ్యక్తిగత జీవితంపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. పెళ్లిపై తనకున్న స్పష్టమైన అభిప్రాయాన్ని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వివాహం గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను పెళ్లిని ఒక ఆటగా భావించడం లేదని స్పష్టం చేశారు. “నేను ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు తీసుకోను. జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి కోసమే నా అన్వేషణ” అని వెల్లడించారు. ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎంత వేగంగా అవుతున్నాయో, అంతే వేగంగా విడాకుల వరకు వెళ్తున్నాయనే విషయాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు.
పెళ్లి విషయంలో తాను ఇంత కఠినంగా ఉండటానికి గల కారణాన్ని కూడా త్రిష బయటపెట్టారు. “నా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది పెళ్లిళ్లు చేసుకుని ప్రస్తుతం తీవ్రమైన మానసిక బాధను అనుభవిస్తున్నారు. కేవలం సమాజం కోసమో, వయసు అయిపోతుందనో పెళ్లి చేసుకుని జీవితాన్ని నరకం చేసుకోలేను. నా స్నేహితుల్లా నేను బాధపడాలని అనుకోవడం లేదు” అని త్రిష చెప్పుకొచ్చారు. తన మనసుకు నచ్చిన, తనకు సరిపోయే సరైన వ్యక్తి దొరికినప్పుడే తాను వివాహ బంధంలోకి అడుగుపెడతానని త్రిష స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి తోడు దొరకకపోతే ఏం చేస్తారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. “ఒకవేళ నాకు తగ్గ వ్యక్తి దొరక్కపోయినా పర్లేదు.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడానికైనా సిద్ధమే తప్ప, తప్పుడు నిర్ణయం తీసుకోను” అంటూ బోల్డ్ స్టేట్మెంట్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
- NP50 : నివిన్ పౌలి 50 'విజయం'.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..