Actress Rohini: రఘువరన్ నన్ను హౌస్‌వైఫ్‌గా ఉండమన్నాడు.. అందుకే సినిమాలకు దూరమయ్యాను: నటి రోహిణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Rohini: సినిమా రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ నటి రోహిణి తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దివంగత నటుడు, తన మాజీ భర్త రఘువరన్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రోహిణి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న టైంలోనే ఆమె నటుడు రఘువరన్ను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఆమె సుదీర్ఘ కాలం పాటు వెండితెరకు దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తను సినిమాలకు అంత కాలం దూరం కావడం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు.
తన సినీ కెరీర్ హఠాత్తుగా ఆగిపోవడానికి గల కారణాలను రోహిణి వివరిస్తూ… రఘువరన్ తనను కేవలం హౌస్‌వైఫ్‌గా మాత్రమే చూడాలనుకున్నారని, తన సినీ కెరీర్‌కు ఆయన నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని స్పష్టం చేశారు. “రఘువరన్ నన్ను పెళ్లి తర్వాత హౌస్వైఫ్గానే ఇంటికే పరిమితం కావాలని కోరుకున్నాడు. నా నటనపై గానీ, నా సినీ కెరీర్‌పై గానీ ఆయనకు ఆసక్తి లేదు. దానికి ఆయన నుంచి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. ఆ మానసిక సంఘర్షణ వల్లే నేను ఏకంగా ఏడేళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సి వచ్చింది” అని వెల్లడించారు. రఘువరన్ – రోహిణి 1996లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు (రిషివరన్) ఉన్నాడు. ఆ తర్వాత వీరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2008 లో రఘువరన్ మరణించారు. ఒకప్పుడు వెండితెరపై తన నటనతో మెప్పించిన రోహిణి, పెళ్లి తర్వాత ఏడేళ్ల పాటు సినిమాలకు దూరం కావడం వెనుక ఉన్న అసలు నిజాన్ని పంచుకోవడంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!