Site icon NTV Telugu

కాజోల్ కు కరోనా… మొహం చూపించలేనంటున్న బ్యూటీ !

Kajol

ఒమిక్రాన్ భయం మధ్య థర్డ్ వేవ్‌లో కరోనా బారిన పడిన బాలీవుడ్ ప్రముఖుల సుదీర్ఘ జాబితాలో తాజాగా కాజోల్ కూడా చేరింది. సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించింది ఈ సీనియర్ బ్యూటీ. అయితే ఈ విషయాన్ని వెల్లడించడానికి కాజోల్ తన పిక్ ను కాకుండా కుమార్తె నైసా ఫోటోను షేర్ చేయడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్‌లో కాజోల్… ఎదో పెళ్లి సమయంలో నైసా చిరునవ్వుతో ఉన్న ఫోటోను పంచుకుంది. ఫోటోలో నైసా తన చిరునవ్వుతో మెహెందీని ప్రదర్శిస్తూ అందంగా కంకన్పిస్తోంది. కాజోల్ తన ఫోటో కంటే నైసా ఫోటోను ఎందుకు ఎంచుకుందో కూడా వెల్లడించింది.

Read Also : “ఖిలాడీ” దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్… విడుదలకు ముందే…!

తన కూతురి చిరునవ్వు, ప్రపంచంలోనే అత్యంత మధురమైనదని కాజోల్ చెప్పుకొచ్చింది. “పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నా రుడాల్ఫ్ ముక్కును ఎవరూ చూడాలని నేను కోరుకోవడం లేదు. కాబట్టి ప్రపంచంలోని మధురమైన చిరునవ్వుతో ఉండండి! మిస్ యూ నైసా” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాజోల్ కామెంట్స్ విభాగాన్ని నింపేశారు అభిమానులు.

నైసా ప్రస్తుతం చదువుతోంది. ఆమె ఎక్కువ సమయం తాను చదువుతున్న సింగపూర్‌లో గడుపుతుంది. అయితే నైసా సింగపూర్‌లో తన చదువును ముగించుకుని ఉన్నత చదువుల కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు గత ఏడాది వార్తలు వచ్చాయి.

Exit mobile version