Jyothika: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య భార్య కాకుండా జ్యోతిక అన్నా ఆమెను గుర్తుపట్టని వారుండరు. అందానికి అందం, అభినయం ఆమె సొంతం. ఇక సూర్యను వివాహమాడి సినిమాలకు దూరమైంది. ఇద్దరు బిడ్డల తల్లిగా ప్రమోషన్ అందుకొని వారి బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను తీసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యకా నిర్మాతగానే కాకుండా నటిగా కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో తనదైన నటనతో మైమరిపించింది. ఇక ఇటీవలే ఆకాశం నీ హద్దురా చిత్రానికి నిర్మాతగా వ్యవహరించినందుకు గాను జాతీయ అవార్డును సైతం అందుకుంది.
ఇక జ్యోతిక పోస్ట్ చేసిన ఒక వీడియోపైనే అందరి కళ్లు పడ్డాయి. ఈ వయస్సులో ఏ హీరోయిన్ చేయని హెవీ వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ వీడియోలో జ్యోతిక చేస్తున్న వర్క్ అవుట్స్ చూస్తుంటే ఒళ్ళు జలదిరించడం ఖాయం అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. “నా పుట్టినరోజుకు నా ఆరోగ్యాన్ని గిఫ్టుగా ఇస్తున్నాను.. మా కోచ్ మహేష్ నాకు ఫంక్షనల్ ట్రైయినింగ్ ఇస్తున్నారు. నా వయస్సు నన్ను మార్చక ముందే.. నా వయస్సును నేను మారుస్తాను” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం జ్యోతిక పలు సినిమాలు నిర్మిస్తూనే కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తోంది. ఇక జ్యో వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మీరు రియల్ ఇన్స్పిరేషన్ అని కొందరు.. చాలామంది హీరోయిన్లు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని మరికొందరు చెప్పుకొస్తున్నారు.