Ilieana:అసలు ఇండస్ట్రీకి ఏమవుతుంది.. ఒకపక్క ఆగని మరణాలు.. ఇంకోపక్క అరుదైన వ్యాధుల బారిన పడుతున్న హీరోయిన్లు. కరోనా తరువాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది అని ఆనందపడేలోపే.. ఇలాంటి విషాద వార్తలు ఇండస్ట్రీని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే నటుడు నందమూరి తారకరత్న హాస్పిటల్ లో అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న విషయాన్నే జీర్ణించుకోలేకపోతున్న అభిమానులకు టాలీవుడ్ నటి ఇలియానా మరో చేదు వార్తను చెప్పుకొచ్చింది. తానూ కూడా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో ఆమె పంచుకుంది. గత మూడు రోజులుగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యిందని తెలుస్తోంది. ఇక ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆమెకు వైద్యులు మూడు సైలెన్స్ బాటిల్స్ పెట్టినట్లు తెలిపింది. కనీసం ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇలియానా ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి అని కానీ, అసలు ఆమె దేనివలన బాధపడుతుంది అనేది మాత్రం చెప్పుకు రాలేదు.
Dasara Teaser: ఏయ్.. బాంచత్ .. నాని నట విశ్వరూపం
ఇక ఇలియానాకు ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. తన ఆరోగ్యం గురించి ఆలోచించి తాను బావుండాలని కోరుకున్న ప్రతి ఒక్కటి గోవా బ్యూటీ ధన్యవాదాలు తెలిపింది. ” ప్రతి ఒక్కరు నా హెల్త్ గురించి మెసేజ్ చేస్తున్నారు. నా మీద అంత ప్రేమను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి నిజమైన ప్రేమను అందుకుంటున్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. నేను ఖచ్చితంగా ఇప్పుడు బావున్నాను అని చెప్తున్నాను. దేవుని దయవలన తగిన సమయంలో తగిన చికిత్స నాకు దొరుకుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇల్లూ బేబీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తోంది.