Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. తాజాగా ఆ ట్వీట్ ను ఉద్దేశిస్తూ నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ ”హలో ప్రకాష్ రాజు గారు, ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూశాను. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని ‘దొర’ అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో ‘దొర’ అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాలని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి, ప్లీజ్.
పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ, కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా, గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. ప్రకాష్ రాజు గారు, మీతో నేను చాలా సినిమాలు భార్యగా యాక్ట్ చేశాను. మీరు ఈరోజు షూటింగ్‌కి వస్తానని డేట్ ఇస్తారు, మేమందరం పొద్దునే మేకప్ వేసుకొని రెడీ అయిపోయి కూర్చుంటాం. ‘ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, 10 నిమిషాల్లో వస్తారు, గంటలో వస్తారు, లంచ్ తర్వాత వస్తారు’ ఇట్లా ఇట్లా అంటారు. మీకు యాక్ట్ చేసే మూడ్ లేక “నేను వేరే కంట్రీ వెళ్ళిపోయాను” అని అంటారు. కనీసం వేరే కంట్రీ వెళ్ళే ముందు ఎవరికీ ఫోన్ చేసి చెప్పడం గానీ, ప్రొడ్యూసర్‌కి గానీ, డైరెక్టర్‌కి గానీ చేయరు.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
నేను కూడా చాలాసార్లు అడిగాను, “సర్, మీ వల్ల మేము సఫర్ అవుతున్నాము. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?” అంటే, “నాకు మూడ్ లేదురా యాక్ట్ చేయడానికి, అందుకే నేను ఆ కంట్రీ వెళ్ళిపోయాను, ఈ ప్రాంతం వెళ్ళిపోయాను” అని చెప్తారు. మరి మీరు నాకు ఒకటి చెప్పండి, రాజకీయాల్లోకి మీరు సింగిల్ గా వస్తారా? గుంపులతో వస్తారా? మీకు రాజకీయాలు చేసి ప్రజాసేవ చేసే మూడ్ ఉందా లేదా? దయచేసి ఒక్కసారి చెప్పండి సార్. థాంక్యూ. అంటూ ఆమె ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!