Site icon NTV Telugu

“మా” ఎలక్షన్స్ : శివబాలాజీ చెయ్యి కొరికిన హేమ

Actress Hema Bites Siva Balaji's Hand

మా ఎన్నికల పోలింగ్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరగడంతో తోపులాట చోటు చేసుకుంది. రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారి ఇరు ప్యానళ్ల నుండి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లను పిలిపించి రిగ్గింగ్ జరిగినట్లు తెలిస్తే ఎన్నికలు ఆపేస్తామని, పైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అయితే ఈ పోలింగ్ సందర్భంగా ఇరు ప్యానళ్ల సభ్యుల మధ్య నెలకొన్న తోపులాటలో నటి హేమ శివ బాలాజీ చెయ్యి కొరికింది అంటూ నరేష్ ఆరోపించారు.

Read Also : ‘మా’ ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం

నరేష్ మాట్లాడుతూ “గొడవ ఏమీ జరగలేదు. ఇది చాలా చిన్న విషయం. ఎవరో ఒకరు ప్రకాష్ రాజ్ బ్యాడ్జ్ వేసుకుని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. నేను ప్రకాష్ కౌగిలించుకున్నాము. నో ఫైటింగ్ ఓన్లీ వోటింగ్ అని చెప్పుకున్నాం. కానీ శివబాలాజీని హేమ కొరికింది” అంటూ నరేష్ అతని చేయి పట్టుకొని మీడియాకు చూపించారు.

Exit mobile version