Rave Party: అది రేవ్ పార్టీ కాదు.. జరిగింది ఇదే.. వీడియో రిలీజ్ చేసిన నటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Ashi Roy Reveals Facts about Bengaluru Rave Party: బెంగళూరు నగర శివార్లలో బెంగళూరు పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా నటి హేమ ఈ పార్టీకి హాజరై హాజరు కాలేదంటూ వీడియో రిలీజ్ చేసిన వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. నిజానికి ఈ పార్టీకి హాజరైన వారిలో ప్రధానంగా హేమా, శ్రీకాంత్ ల పేర్లు వినిపించాయి. ముందుగా హేమ ఒక వీడియో రిలీజ్ చేసింది. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్న అని చెప్పుకొచ్చింది. అయితే అది నిజం కాదని బెంగళూరు పోలీసులు తేల్చారు. ఆ తర్వాత శ్రీకాంత్ వీడియో రిలీజ్ చేశారు. శ్రీకాంత్ హైదరాబాద్ లోనే ఉన్నట్లు తేలింది. అయితే మరొక నటి ఆషీ రాయ్ కూడా ఈ పార్టీలో ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏమిటి.. ఇందులో జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఇవే..
Also Read
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
అయితే ఆమె ఈ పార్టీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒకటే చెప్పాలనుకుంటున్నా, నేను బర్త్ డే పార్టీ కోసం వెళ్లాను. వాసుని నేను అన్నయ్య అని పిలుస్తాను. అక్కడ బర్త్డే పార్టీ జరుగుతోంది, లోపల అందరూ ఏం చేస్తున్నారో ఏమో నాకైతే తెలియదు. సో దయచేసి మీరందరూ నన్ను ఆదుకోండి. నేను ఒక ఆడపిల్లని ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నాను కష్టపడి, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇప్పుడు ఒక లింకు పెడుతున్నాను చూడండి అంటూ ఆమె ఒక వీడియోని షేర్ చేసింది.
అయితే నిన్న పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో అసలు హేమని తాను అక్కడ చూడలేదని ఆమె వెల్లడించింది. హేమ అంటే తనకు ముందు నుంచే పరిచయం అని కానీ ఆమె ఆ ఫామ్ హౌస్ లో కానీ పార్టీలో కానీ కనిపించలేదని పేర్కొంది. ఇక పార్టీలో పాల్గొన్న వారందరి దగ్గర శాంపిల్స్ తీసుకున్నారని ఆ తర్వాత పోలీసులు వదిలిపెట్టినట్టు ఆషీ రాయ్ వెల్లడించారు. ఆమె తెలుగులో కెఎస్ హండ్రెడ్, మిస్టరీ ఆఫ్ సారిక లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. అలాగే పలు కన్నడ సినిమాల్లో సైతం ఆమె నటించింది. ఇప్పుడు అనుహ్యంగా ఈ డ్రగ్స్ కేసు కారణంగా తెరమీదకు వచ్చింది.
తాజావార్తలు
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!