Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Antony: తమిళనాడు రాజకీయాలు, సినిమా పరిశ్రమ మధ్య మరో ఆసక్తికరమైన – ఆత్మీయ కలయిక మొదటి నుంచి మనం చూస్తునే ఉన్నాం. తాజాగా ప్రముఖ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ.. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నైలోని సీఎం నివాసానికి వెళ్లిన విజయ్ ఆంటోనీ.. ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం విజయ్‌తో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోను విజయ్ ఆంటోనీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. “గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ గారిని కలవడం నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించింది. ప్రజల సేవకు, సమాజంలో గొప్ప మార్పు తీసుకురావడానికి ఆయనకు ఎల్లప్పుడూ ఎంతో బలం, విజ్ఞత, అపారమైన శక్తి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ విజయ్ ఆంటోనీ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
ఒకప్పుడు విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్స్ ‘వేట్టైక్కారన్’ (తెలుగులో పులివేట), ‘వేలాయుధం’ వంటి భారీ చిత్రాలకు విజయ్ ఆంటోనీ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఆ సినిమాల్లోని పాటలు ఇప్పటికీ చార్ట్బస్టర్సే. అలాంటిది చాలా కాలం తర్వాత వీరిద్దరూ ఇలా ఒకే ఫ్రేమ్‌లో, అది కూడా విజయ్ సీఎం అయ్యాక విజయ్ ఆంటోని ఆయనను కలవడం చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ భేటీని ప్యూర్ ‘OG కాంబినేషన్’ అంటూ సోషల్ మీడియాలో నెట్టిజన్లు కామెంట్లు పెడుతూ వారి ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
Met our Honourable Chief Minister today and spent some wonderful time with him. It was truly inspiring to see his positivity and energy, as always.
Wishing him continued strength, wisdom, and good health. May the universe bless him with abundant positivity and energy to continue… pic.twitter.com/qaYHwC2nvE
— vijayantony (@vijayantony) June 2, 2026
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?