Site icon NTV Telugu

హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్

srikanth

రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల జాబితాలో సెలెబ్రిటీలు వరుసగా చేరిపోతున్నారు. ఈరోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి రెండవసారి పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించగా, తాజాగా మరో యంగ్ హీరో కోవిడ్ పాజిటివ్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఇటీవలే ‘అఖండ’లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ మేకా ఈరోజు కోవిడ్-19 బారిన పడ్డారు.

Read Also : పవర్ స్టార్ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్ల షాకింగ్ డెసిషన్

ఈ విషయాన్ని శ్రీకాంత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. “ప్రియమైన స్నేహితులారా, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కోవిడ్ -19కి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజుల నుండి కొన్ని లక్షణాలు కన్పించాయి” అని తెలిపాడు. ఇక కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారు తమకు కూడా ఏవైనా లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని కూడా ఆయన అభ్యర్థించారు.

‘అఖండ’తో సూపర్ విలన్‌ గా టర్న్ తీసుకున్న ఈ హీరో, అందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ ఈ హీరో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ రాబోయే చిత్రం ‘జేమ్స్‌’లో కీలక పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version